Fri Jan 17 2025 21:12:18 GMT+0000 (Coordinated Universal Time)
కుప్పంలోనూ చంద్రబాబుకు ఓటమి తప్పదు : పెద్దిరెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రాజెక్టునైనా రాయలసీమలో నిర్మించారా? అని ఆయన ప్రశ్నించారు. కుప్పంలో సయితం చంద్రబాబు ఓడిపోతాడని ఆయన జోస్యం చెప్పారు. ఏడుసార్లు గెలిపించిన కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమీ చేయలేదని, జగన్ హయాంలోనే అక్కడ అభివృద్ధి జరిగిందని, చివరకు నీళ్లు కూడా వచ్చాయని అన్నారు. అమిత్ షా కాళ్లు పట్టుకుని చంద్రబాబు పొత్తు కుదుర్చుకుని వచ్చారన్నారు.
ఒంటిరిగా ఎదుర్కొనే ....
జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేకనే ఆయన పొత్తులతో ముందుకు వస్తున్నాడని అన్నారు. చంద్రబాబు పైకి చెప్పేవన్నీ ప్రగల్భాలేనని, లోపల మాత్రం అంత పిరికివాడు మరొకడు ఉండరని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలు మారి చివరకు బీజేపీలో చేరి రాజంపేట టిక్కెట్ తెచ్చుకున్నాడని, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కౌంటర్ పెట్టి కమీషన్లు దండుకున్న కిరణ్ కు ఎవరూ ఓటు వేయరని కూడా పెద్దిరెడ్డి అన్నారు. తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం చివరకు రాష్ట్రాన్ని కూడా విడగొట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు ఆదరించరన్నారు.
Next Story