Sun Mar 15 2026 10:54:41 GMT+0530 (India Standard Time)
షర్మిలపై పెద్దిరెడ్డి హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆమె చంద్రబాబు వదలిన బాణమంటూ ఆయన మండిపడ్డారు. చంద్రబాబు కుట్రలో భాగంగానే షర్మిల కాంగ్రెస్ లో చేరారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. నాడు రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ ఎంత కారణమో, చంద్రబాబు కూడా అంతే కారణమని ఆయన అన్నారు.
చనిపోయిన కాంగ్రెస్ ను...
ఆంధ్రప్రదేశ్ లో చనిపోయిన కాంగ్రెస్ కు ఊపిరి పోయాలని షర్మిలకు ఆ పదవి ఇచ్చినట్లుందని, కానీ శవంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి నలుగురు మోసుకెళుతున్నారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ లో ఉన్న వాళ్లు రాష్ట్ర ద్రోహులన్న పెద్దిరెడ్డి, గతంలో కాంగ్రెస్ లో ఉన్నవాళ్లు ఇప్పటికే వైసీపీలో చేరారన్నారు. చంద్రబాబు మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
Next Story

