Sat Mar 21 2026 15:23:07 GMT+0530 (India Standard Time)
పూతలపట్టు ఎమ్మెల్యేపై పెద్దిరెడ్డి సీరియస్
పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ అయ్యారు

పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీరియస్ అయ్యారు. ఎంఎస్ బాబు పార్టీపైన, తనపైన చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. ఆయన మాటలు అర్థం లేవని అన్నారు. జడ్పీటీసీగా కూడా గెలవలేని ఎంఎస్ బాబును ఎమ్మెల్యేగా చేసింది వైసీపీ పార్టీయేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
ఎవరో మాటలను నమ్మి...
ఆ విషయాన్ని మరచిపోయి ఎవరో మాటలను నమ్మి పార్టీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ఎవరైనా పార్టీ ఆదేశాలను పాటించాల్సిందేనని తెలిపారు. ఎస్సీ నియోజకవర్గాలకు మాత్రమే కాదు.. అన్ని నియోజకవర్గాల్లోనూ గెలుపు అవకాశాలను అనుసరించే అభ్యర్థులను నిర్ణయం తీసుకుంటారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు.
Next Story

