Sun Feb 01 2026 12:40:55 GMT+0000 (Coordinated Universal Time)
వసంత మళ్లీ మా అభ్యర్థి.. పెద్దిరెడ్డి స్పష్టీకరణ
వైసీపీ ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగిరమేష్ ల వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు

వైసీపీ ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, జోగిరమేష్ ల వివాదంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. వసంత కృష్ణ ప్రసాద్ కు వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్లేనని పెద్దిరెడ్డి తెలిపారు. మైలవరం, పెడన వైసీపీ కార్కకర్తల మధ్య ఘర్షణలు పార్టీకి తలనొప్పిగా మారాయి. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో....
వసంత కృష్ణ ప్రసాద్ వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ అభ్యర్థిగా మైలవరం నుంచి బరిలోకి దిగుతారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అలాగే పెడన నుంచి జోగి రమేష్ పోటీ చేస్తారని మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఎవరినియోజకవర్గంలో వారు పార్టీ బలోపేతానికి పనిచేయాలని ఆయన కోరారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కృష్ణా జిల్లా ఇన్ ఛార్జి మంత్రి కావడంతో ఈ రెండు నియోజకవర్గాల్లో తలెత్తిన విభేదాలపై ఆయన స్పందించారు.
Next Story

