Wed Mar 18 2026 22:04:14 GMT+0530 (India Standard Time)
పట్టిసీమ నుంచి నీరు విడుదల
పట్టిసీమ నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేశారు

పట్టిసీమ నుంచి మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టా రైతులకు సాగు నీరు అందించేందుకు ఈ నీటిని విడుదలచేశారు. వెయ్యి క్యూసెక్కుల నీటిని కృష్ణా డెల్టాకు నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. పోలవరం కుడి కాల్వ నుంచి పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ నీటిని విడుదల చేశారు.
సాగు, తాగు నీటిని...
సాగు, తాగు నీటి అవసరాల కోసం విడతల వారీగా నీటిని విడుదల చేస్తామనిఈ సందర్భంగా అధికారులు తెలిపారు. పట్టిసీమ లిఫ్ట్ వద్ద ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన నీటిని విడుదల చేశారు. దీంతో కృష్ణా రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న్నారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో పాటు అధికారులు పాల్గొన్నారు.
Next Story

