Wed Feb 04 2026 05:54:53 GMT+0000 (Coordinated Universal Time)
లండన్ నుంచి ఖతార్ కు నారాయణ
లండన్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది.

లండన్ లో మంత్రి నారాయణ బృందం పర్యటన కొనసాగుతుంది. లండన్ స్ట్రాట్ ఫోర్డ్ లోని క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్ ను మంత్రి నారాయణ బృందం సందర్శించింది. 2012 లో ఒలింపిక్ గేమ్స్ కోసం నిర్మించిన పార్క్ లోని పలు క్రీడా పార్కులు పరిశీలించిన మంత్రి నారాయణ బృందం లండన్ స్టేడియం,లండన్ ఆక్వాటిక్స్ సెంటర్,హైడ్ పార్క్, లీ వ్యాలీ వేలోపార్క్ ల నిర్మాణాలు అధ్యయనం చేశారు.
స్పోర్ట్స్ సిటీకి...
ఒలింపిక్స్ ప్రధాన క్రీడలైన ఫుట్ బాల్,రగ్బీ, బేస్ బాల్ గేమ్స్ నిర్వహించిన లండన్ స్టేడియం లో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ అమరావతిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సంబంధించి ఆయా స్టేడియంలు పరిశీలించారు. రెండు రోజుల లండన్ పర్యటనముగించుకుని మంత్రి నారాయణ బృందం ఖతార్ బయలుదేరి వెళ్లారు.
Next Story

