Thu Mar 19 2026 03:49:53 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి నారాయణ విదేశీ పర్యటన
ఈరోజు నుంచి మంత్రి నారాయణ విదేశీ పర్యటనలో ఉండనున్నారు

ఈరోజు నుంచి మంత్రి నారాయణ విదేశీ పర్యటనలో ఉండనున్నారు. అధికారిక పర్యటన కోసం యూకే,ఖతార్ పర్యటనకు మంత్రి నారాయణ వెళుతున్నారు.మంత్రి వెంట మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాస్ పర్యటనకు వెళ్తున్నారు.అమరావతి నిర్మాణంలో పలు ప్రాజెక్టుల అభివృద్ధి కి లండన్,దోహా లో అధ్యయనానికి వెళ్తున్నారు.
టూరిజం ప్రాజెక్టులపై...
అమరావతిలో టూరిజం ప్రాజెక్టులు,రివర్ ఫ్రంట్ అభివృద్ధి,ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం పలు ప్రాంతాలు మంత్రి నారాయణ బృందం పరిశీలించనుంది. ఈ నెల 2,3 తేదీల్లో లండన్,ఈ నెల 4,5 తేదీల్లో దోహా లో పర్యటించనుంది. తిరిగి ఈ నెల 5 న రాత్రికి అమరావతి కి మంత్రి నారాయణ చేరుకోనున్నారని ఆయన కార్యాలయం ప్రకటించింది.
Next Story

