Tue Apr 07 2026 10:01:06 GMT+0530 (India Standard Time)
విజయవాడలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
నేడు విజయవాడలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు

నేడు విజయవాడలో మంత్రి నారాయణ పర్యటించనున్నారు. విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మూడు కీలక రోడ్ల విస్తరణకు శంకుస్థాపన మంత్రి నారాయణ చేయనున్నారు. విజయవాడ ఈస్ట్, పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో రోడ్ల విస్తరణ పనులను ప్రారంభించనున్నారు. ఇవాళ సాయంత్రం విజయవాడలో పర్యటించనున్న మంత్రి నారాయణ విజయవాడ ట్రాఫిక్ కష్టాలు తీర్చేలా మూడు కీలక రోడ్ల విస్తరణకు శంకుస్థాపన చేయనున్నారు.
ట్రాఫిక్ కష్టాలు తగ్గించేందుకు..
విజయవాడ ఈస్ట్,పెనమలూరు.గన్నవరం నియోజకవర్గాల్లో రోడ్ల విస్తరణతో పాటు విజయవాడ నుంచి శివారు ప్రాంతాలకు ట్రాఫిక్ లేకుండా వెళ్లేలా సీఆర్డీఏ నిధులతో రోడ్ల విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొత్తం 105 కోట్లతో చేపడుతున్న పనులకు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ శంకుస్థాపనలు చేయనున్నారు. బల్లెంవారి వీధి నుంచి పోరంకి - నిడమానూరు రోడ్డు,ఆటో నగర్ - మురళి నగర్ రోడ్డు,బల్లెంవారి వీధి - నిడమానూరు జంక్షన్ రోడ్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
Next Story

