రాజధాని నిర్మాణంపై అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చిన నారాయణ
రాజధాని నిర్మాణానికి 64,721.48 కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ తెలిపారు

రాజధాని నిర్మాణానికి 64,721.48 కోట్లు ఖర్చవుతుందని మంత్రి నారాయణ తెలిపారు. అసెంబ్లీ ఈ వివరాలను వెల్లడించారు. మూడేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామన్న నారాయణ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో ఇళ్లు,భవన నిర్మాణాలు,ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్,ఎల్పీఎస్ మౌళిక సదుపాయాల అభివృద్ది కోసం 64,721.48 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు.ఈ నిధులను వివిధ రూపాల్లో సేకరించి అమరావతి నిర్మాణం చేపడుతున్నామని, బహుళ పక్ష ఏజెన్సీలు,బ్యాంకుల నుండి లోన్ లు,కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంటులను పొందడం ద్వారా నిధుల సేకరణ జరుపుతున్నామని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు అభివృద్ది చేసిన ప్లాట్లను దశల వారీగా మూడేళ్లలో అప్పగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నారాయణ 2019-24 మధ్య విధానపరమైన అనిశ్చితుల కారణంగా ఈ ప్రక్రియలో జాప్యం జరిగిందని, ప్రపంచలో టాప్ 5 లో ఒకటిగా ఉండాలని సీఎం చంద్రబాబు రాజధానిని డిజైన్ చేసారని తెలిపారు. కానీ శాడిజంతో శాడిజంతో కక్ష సాధింపుతో ఆర్ - 5 జోన్ చేసి జగన్ 50 వేల మందికి ఒక సెంట్ భూమి ఇచ్చారన్నారు.

