Fri Dec 05 2025 11:28:33 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నేడు మంగళగిరిలో లోకేష్ పర్యటన
మంత్రి నారా లోకేష్ నేడు మంగళగిరిలో పర్యటించనున్నారు. బక్రీద్ నాడు ముస్లిం సోదరులతో కలసి ప్రార్థనల్లో పాల్గొననున్నారు

ఏపీ మంత్రి నారా లోకేష్ నేడు మంగళగిరిలో పర్యటించనున్నారు. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులతో కలసి లోకేష్ ప్రార్థనల్లో పాల్గొననున్నారు. దీంతో పాటు వివిధ సమస్యలపై ఆయన స్థానికులతో చర్చించనున్నారు. మంగళగిరిలో లోకేష్ పర్యటిస్తుండటంతో భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు.
ఎన్నికలు పూర్తయిన తర్వాత...
ఎన్నికలు పూర్తయిన తర్వాత తొలిసారి మంగళగిరిలో లోకేష్ పర్యటిస్తున్నారు. తొలిసారి మంత్రిగా ఆయన నియోజకవర్గానికి వస్తుండటంతో తమ సమస్యలను చెప్పుకునేందుకు అధిక సంఖ్యలో ప్రజలు వస్తారని భావించి పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఆయన అందరి నుంచి వినతి పత్రాలను స్వీకరించనున్నారు.
Next Story

