Fri Dec 05 2025 13:24:49 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : పెండింగ్ ప్రాజెక్టులపై నేడు కేంద్ర మంత్రులతో లోకేశ్ భేటీ
రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు మంత్రి నారా లోకేష్ నేడు అనేక కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు

రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులపై సంబంధిత కేంద్ర మంత్రులతో చర్చించేందుకు మంత్రి నారా లోకేష్ నేడు అనేక కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రులతో భేటీ అయిన లోకేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం వరస భేటీలు చేయనున్నారు. నేటి పర్యటనలో రాష్ట్రానికి ఇటీవల సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మంజూరు చేసినందుకు కేంద్ర రైల్వే, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి అశ్వనీ వైష్టవ్ కు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు చెబుతారు.
పెండింగ్ ప్రాజెక్టులపై...
దీంతో పాటు రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్ర రోడ్డురవాణా, రహదార్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, ఓడరేవులు, జలరవాణాశాఖ మంత్రి సర్పానంద్ సోనోవాల్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తో మంత్రి లోకేష్ సమావేశమవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వం తరపున వివిధ ప్రతిపాదనలను కేంద్రమంత్రులకు మంత్రి నారా లోకేశ్ అందజేయనున్నారు. వివిధ అంశాలపై వారితో నేడు చర్చించనున్నారు.
Next Story

