Sat Jan 31 2026 21:36:21 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలను చేపట్టారు. సచివాలయంలో ఆయన ఛాంబర్ లోకి అడుగుపెట్టారు

మంత్రి నారా లోకేష్ సచివాలయంలో బాధ్యతలను చేపట్టారు. ఐటీ, విద్య, ఆర్టీజీ శాఖల మంత్రిగా లోకేష్ బాధ్యతలను ఈరోజు చేపట్టారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ రూమ్ నెంబరు 208లో ఆయన కొద్దిసేపటి క్రితం బాధ్యతలను స్వీకరించారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. వేద పండితుల ఆశీర్వచనాలు, సన్నిహితుల తో కలసి ఆయన తన చాంబర్ లోకి అడుగుపెట్టారు.
సంతకం చేసి...
ఆయన కొన్ని పైళ్లను చూసి సంతకం చేశారు. అధికారులు, తెలుగుదేశం పార్టీ నేతలు సచివాలయానికి బాధ్యతలను స్వీకరించడానికి వస్తుండటంతో పెద్దయెత్తున స్వాగతం పలికారు. పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఆయన సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరు కానున్నారు.
Next Story

