Sun Apr 20 2025 18:49:12 GMT+0000 (Coordinated Universal Time)
ఇంటర్ విద్యార్థులకు నేడు లోకేశ్ సన్మానం
ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ నేడు సన్మానించనున్నారు

ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మంత్రి నారా లోకేశ్ నేడు సన్మానించనున్నారు. ఇటీవల ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదలయిన సంగతి తెలిసింది. అయితే ఈ పరీక్ష ఫలితాల్లో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ లకు చెందిన కళాశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో ఉత్తీర్ణులయ్యారు.
అత్యధిక మార్కులు సాధించిన...
వీరితో పాటు పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన 52 మందిని ‘షైనింగ్ స్టార్స్-2025’ అవార్డులతో విద్యా శాఖ మంత్రి లోకేశ్ మంగళవారం సన్మానించనున్నారు. ఇంటర్, ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులు 29 మంది ఉండగా కేజీబీవీ, ఏపీఆర్జేసీ నుంచి ఏడుగురు విద్యార్థుల చొప్పున ఉండగా.. మిగిలిన వారిలో ఆదర్శ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్కు చెందిన విద్యార్థులు ఉన్నారు.
Next Story