Fri Dec 05 2025 16:02:40 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : గిరిజన ప్రాంతాలకు ప్రాధాన్యత : నారా లోకేశ్
గిరిజన ప్రాంతాల్లో నూరుశాతం శాశ్వత భవనాల ఏర్పాటుకు సంకల్పించామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు

గిరిజన ప్రాంతాల్లో నూరుశాతం శాశ్వత భవనాల ఏర్పాటుకు సంకల్పించామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అల్లూరి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కోసం నిధులిచ్చామని తెలిపారు. 45.02 కోట్లు విడుదల చేస్తూ జీవో నం.264ని విడుదల చేశామన్న నారా లోకేశ్ పనులు వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలిచ్చామని చెప్పారు.
గత ఆర్థిక సంవత్సరంలో...
గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్న నారా లోకేశ్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే జీవనశైలికి ఆదివాసుల సొంతమని, కూటమి ప్రభుత్వంలో ఆదివాసీల సంక్షేమం కోసం నిత్యం కృషిచేస్తున్నామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 7,557 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశామని, భవిష్యత్‌లోనూ గిరిజనులకు అన్నివిధాలా అండగా నిలుస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Next Story

