Fri Dec 05 2025 17:39:54 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : తల్లికి వందనంపై కీలక అప్ డేట్ ఇచ్చిన లోకేశ్
తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు

తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతోందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభలో వైసీపీ సభ్యులు పంపిన ప్రశ్నకు మంత్రి లోకేష్ సమాధానమిస్తూ... తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ఇస్తామన్నారు. బడ్జెట్ లో రూ.9407 కోట్లు ఈ పథకానికి కేటాయించామన్న లోకేశ్ గత ప్రభుత్వంలో వారు సంవత్సరానికి 5,540 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు.
అందరికీ పథకం...
గతంతో పోలిస్తే ఇది 50శాతం అధికమన్న నారా లోకేశ్ ఎన్నికలకు ముందుకు చంద్రబాబు సూపర్ – 6 అనే కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తల్లికి వందనం పథకాన్ని చంద్రబాబుగారు ప్రకటించారన్నారు. భారతదేశంలో రీప్లేస్ మెంట్ రేట్ లో తమిళనాడు తర్వాత స్థానంలో ఎపిలో ఉందని, మేనెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు.
Next Story

