Sun Dec 14 2025 01:57:18 GMT+0000 (Coordinated Universal Time)
ఐదేళ్లలో నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు : లోకేశ్
సింగపూర్ పర్యటనతో నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు

సింగపూర్ పర్యటనతో నలభై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఐదేళ్లలో 45 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని మంత్రి నారా లోకేశ్ చుససాడేజ సచివాలయంలో మీడియాతో మంత్రి మాట్లాడారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్, డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు కాబోతున్నట్లు వెల్లడించారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా వైఎస్ జగన్ ఇంకా కుట్రలు చేస్తున్నారని, ఏపీతో ఒప్పందాలు చేసుకోవద్దని మెయిల్ పంపించారని, దీని వెనక ఉన్నది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే నని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
గత ప్రభుత్వం ప్రభుత్వం...
అయినా చంద్రబాబు నాయుడు బ్రాండ్ గురించి, హిస్టరీ గురించి తెలిసిన సింగపూర్ ప్రభుత్వం దీనిని లెక్క చేయలేదని చెప్పారు. 2019 నుంచి 2024 మధ్య ఏపీ బ్రాండ్ ను జగన్ నాశనం చేశారన్న లోకేశ్ పారదర్శకతలో సింగపూర్ ప్రభుత్వం ముందుంటుందని, దానిపై అవినీతి ముద్ర వేసి సింగపూర్ తో ఒప్పందాలను గత ప్రభుత్వం రద్దు చేసుకుందని అననారు. టీసీఎస్ కు విశాఖలో 99 పైసలకే ఎకరా భూమిని కేటాయించామన్న లోకేశ్ తాము హెరిటేజ్ కు కేటాయించలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారాయన.
Next Story

