Fri Dec 19 2025 02:29:40 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : లోకేష్ ఇంత ఎమోషనల్ అయ్యారే?
తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మహత్యపై మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు

తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఆత్మహత్యపై మంత్రి నారా లోకేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. " అన్నా..అన్నా... అని పిలిచేవాడివి ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయం చేయాలని మెసేజ్ చేసేవాడివి. నీకు ఆపద వస్తే ఈ అన్నకి ఒక్క మెసేజ్ చేయాలనిపించలేదా ? దిద్దలేని చాలా పెద్ద తప్పు చేశావు తమ్ముడు ఐ మిస్ యూ" అంటూ ఎక్స్ లో లోకేష్ తన బాధను పంచుకున్నారు.
ఎక్స్ లో పోస్టు పెట్టి...
"నువ్వు ఆత్మహత్య చేసుకున్న సంగతి సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని నిన్ను కాపాడుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. నీ కుటుంబానికి ఓ అన్నగా నేనున్నాను. ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా కష్టసుఖాలను పంచుకుందాం. బతికే ఉందాం ఇంకో నలుగురిని బతికిద్దాం " అంటూ కార్యకర్త ఆత్మహత్యపై లోకేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నేనున్నానంటూ...
"ఆత్మాభిమానం ఉండొచ్చు. ఆత్మ..హత్య చేసుకునేంతగా కాదు. నువ్వు బలవన్మరణానికి పాల్పడిన విచారకర సంఘటన సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న వెంటనే, నిన్ను బతికించుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. సారీ శీను..నీకున్న కష్టమేంటో నాకు ఎప్పుడూ చెప్పలేదు. నీకు కలిగిన నష్టమేంటో ఏ రోజూ నాకు తెలియనివ్వలేదు. నువ్వు లేవు కానీ నీ కుటుంబానికి నేనున్నాను.. మీ అన్నగా ఆ కుటుంబానికి అండగా ఉంటూ నీ బాధ్యతల్ని నేను నెరవేరుస్తాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నా అభిమానులు, సోషల్ మీడియా యాక్టివిస్టులకు నా విన్నపం. అప్పులో, అనారోగ్యమో, ఆత్మాభిమానమో, కుటుంబ సమస్యలో ఏమైనా కానివ్వండి.. కుటుంబం, స్నేహితులు, బంధువులు, పార్టీలో హితులు.. ఎవరితోనైనా షేర్ చేసుకోండి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. బతికి ఉందాం.. మరికొందరిని బతికించుకుందాం.. దయచేసి ఇటువంటి తప్పుడు నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోవద్దు" అని పోస్టు చేశారు.
Next Story

