Sun Mar 08 2026 06:17:40 GMT+0530 (India Standard Time)
Nara Lokesh : వైసీపీ కార్యాలయాలకు నోటీసులపై లోకేష్ ఫస్ట్ రియాక్షన్
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ కార్యాలయాలకు నోటీసులు ఇవ్వడంపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆయన ట్వీట్ చేస్తూ అధికారులు ఎందుకు నోటీసులు ఇస్తున్నారో తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడు నామమాత్రపు లీజుతో 26 ఎకరాలను పార్టీ ఆఫీసుల నిర్మాణానికి కట్టబెట్టారన్నారు. ఒక్కొక్క కార్యాలయానికి లీజు మొత్తం వెయ్యి రూపాయలుగా నిర్ధారించారన్నారు.
కారు చౌకగా...
ప్రభుత్వ భూములను కారు చౌకగా తీసుకుని పార్టీ కార్యాలయాలను ప్యాలెస్ తరహాలో నిర్మించడానికి పార్టీ నేతలు సిద్ధమయ్యారని, అనుమతులు తీసుకోకుండా, నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తున్న, నిర్మించిన కార్యాలయాలకు సంబంధించి అధికారులు నోటీసులు ఇచ్చారని, ఇందులో కక్ష సాధింపు చర్య ఎక్కడని ఆయన ప్రశ్నించారు.
Next Story

