Sat Dec 06 2025 08:41:27 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కి నారా లోకేశ్ ఓపెన్ ఛాలెంజ్
వైసీపీ అధినేత జగన్ కు మంత్రి నారా లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు

వైసీపీ అధినేత జగన్ కు మంత్రి నారా లోకేశ్ బహిరంగ సవాల్ విసిరారు. జగన్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని లోకేశ్ అన్నారు. జగన్ చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. ఆరోపణలు చేయడం, పారిపోవడం జగన్ కి కొత్తేమీ కాదని, ఉర్సా కంపెనీకి విశాఖపట్నంలో ఎకరం రూపాయికే భూములు కట్టబెట్టారంటూ తీవ్ర ఆరోపణ చేశారని, తాను స్పష్టంగా మరోసారి చెబుతున్నానని, ఉర్సా కంపెనీకి విశాఖలోని ఐటి పార్క్ హిల్ - 3 లో ఎకరం కోటి రూపాయలు చొప్పున మూడున్నర ఎకరాలు కేటాయించామని చెప్పారు.
ఆరోపణలు నిరూపిస్తూ...
కాపులుప్పాడలో ఎకరం యాభై లక్షల చొప్పున 56.36 ఎకరాలు కేటాయించామన్న లోకేశ్ బురదజల్లి ప్యాలస్ లో దాక్కోవడం కాదని, చేసిన ఆరోపణలు నిరూపించాలని కోరారు." ఛాలెంజ్ కు సిద్ధమా జగన్ రెడ్డి ? మీ ఐదేళ్ల విధ్వంస పాలనలో ఒక్క కంపెనీ తీసుకురాకపోగా ఉన్న కంపెనీలను ఇతర రాష్ట్రాలకు తరిమేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబడుతున్నాం. కంపెనీలు రావడం, యువతకు ఉద్యోగ అవకాశాలు రావడం చూసి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈనో వాడండి కాస్త రిలీఫ్ వస్తుంది" అని లోకేశ్ ట్వీట్ చేశారు.
Next Story

