Fri Dec 05 2025 16:20:10 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన నారా లోకేశ్
నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు.

నిరుద్యోగులకు మంత్రి నారా లోకేశ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. డీఎస్సీ నోటిఫికేషన్ పై మండలిలో వైసీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారాన్నారు. వారందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్న లోకేశ్ తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు డీఎస్పీ ఫైల్ పైనే మొదటి సంతకం చేయడం జరిగిందని గుర్తు చేశారు.
వర్గీకరణ విషయంలో...
గత ఏడాది జూన్ నెలలో టెట్ పరీక్షను నిర్వహించామని, 4.27 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 3.68 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 1.87 లక్షల మంది అర్హత సాధించారన్న లోకేశ్ వర్గీకరణపై వన్ మ్యాన్ కమిషన్ నివేదిక త్వరలోనే రాబోతోందని భావిస్తున్నామన్నారు. ఎట్టిపరిస్థితుల్లో మార్చి నెలలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని నిరుద్యోగ యువతీ,యువకులకు ఈ సభ సాక్షిగా హామీ ఇస్తున్నానని నారా లోకేశ్ తెలిపారు.
Next Story

