Sat Dec 06 2025 02:11:49 GMT+0000 (Coordinated Universal Time)
Nara Lokesh : జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ మెడికల్ కళాశాలలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు

ఆంధ్రప్రదేశ్ మెడికల్ కళాశాలలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తాము ఏమీ మెడికల్ కాలేజీలను అమ్మడం లేదని నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం నుంచి తగ్గించేందుకు పీపీపీ విధానాన్ని ఎంచుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి బయటపడాలంటే ఇందుకు మించి మార్గం లేదని లోకేశ్ అన్నారు.
అప్పుడే పూర్తి చేసి ఉంటే...
వైసీపీ హయాంలో మెడికల్ కళాశాలలను ఎందుకు పూర్తి చేయలేదని నారా లోకేశ్ ప్రశ్నించారు. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అని, ఇందులో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుందని తెలిపారు. తెలియకపోతే మీ సలహాదారులను అడిగి తెలుసుకోవాలంటూ హితవు పలికారు. పీపీపీ వలన పేద విద్యార్థులకు నష్టం ఉండదని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
Next Story

