Fri Dec 05 2025 16:25:16 GMT+0000 (Coordinated Universal Time)
కోట శ్రీనివాసరావు మృతి పట్ల లోకేశ్ దిగ్భ్రాంతి
ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు

ప్రముఖ సినీ నటులు కోట శ్రీనివాసరావు మృతి పట్ల మంత్రి నారా లోకేశ్ సంతాపం తెలియజేశారు. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించుకున్నారన్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారని నారా లోకేశ్ ప్రశంసించారు.
ఇతర భాషల్లోనూ మెప్పించి....
ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని, . 1999లో విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవతోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారని, ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటన,ి వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని లోకేశ్ ఎక్స్ లో పేర్కొన్నారు.
Next Story

