Fri Dec 05 2025 15:54:59 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. జూన్ 1 నుంచి అమలు
గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ బియ్యం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు

గత ప్రభుత్వం ఇంటింటికీ రేషన్ బియ్యం పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం MDU వాహనాల కొనుగోలుకు 1860 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసిందని అన్నారు. గతంలో ఇంటింటింకీ రేషన్ బియ్యం డెలివరీ జరగలేదన్న నాదెండ్ల మనోహర్ పెద్దయెత్తున అవినీతి జరిగిందని చెప్పారు.
రేషన్ బియ్యాన్ని...
సుమారు 30 శాతం మందికి రేషన్ బియ్యం అందలేని IVRS ద్వారా తమకు తెలిసిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. జూన్ 1 నుంచి రేషన్ షాపుల ద్వారానే రేషన్ బియ్యాన్ని ప్రజలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అరవై ఐదేళ్లు దాటిన వృద్దులు, వికలాంగులకు మాత్రం రేషన్ బియ్యం డోర్ డెలివరీ చేస్తామన్నారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.
Next Story

