Fri Dec 05 2025 14:58:16 GMT+0000 (Coordinated Universal Time)
పిఠాపురం వర్మపై నాదెండ్ల సంచలన కామెంట్స్
వర్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడానికి కారణం తాము కాదని జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయకపోవడానికి కారణం తాము కాదని జనసేన మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వర్మకు చెక్ పెట్టాల్సిన అవసరం తమకు లేదని కూడా నాదెండ్ల అన్నారు. అది తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారమన్న నాదెండ్ల తాము అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు.
న్యాయం జరగాలంటూ...
పిఠాపురం నియోజకవర్గంలో టిక్కెట్ ను త్యాగం చేసిన వర్మకు న్యాయం జరగాలని తాము కూడా కోరుకుంటున్నామని తెలిపారు. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశామన్న నాదెండ్ల మనోహర్ పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకే ఇక్కడ ఆవిర్భావ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Next Story

