Thu Mar 19 2026 10:26:25 GMT+0530 (India Standard Time)
మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం
అప్పటికే నాలుగు గంటలుగా స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడిన భక్తులు.. మంత్రి రాకతో సహనం కోల్పోయారు.

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనార్థం.. శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లిన ఏపీ దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది. స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేశారు. మంత్రి గో బ్యాక్ అంటూ నినదించారు.
అప్పటికే నాలుగు గంటలుగా స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో నిలబడిన భక్తులు.. మంత్రి రాకతో సహనం కోల్పోయారు. ఆలయ అర్చకులు మంత్రికి పూలదండ వేసి స్వాగతం పలకడాన్ని సహించలేకపోయారు. క్యూలైన్లో గంటలతరబడి నిలబడి సొమ్మసిల్లి పడిపోతున్నా భక్తులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులతో మాట్లాడిన మంత్రి.. వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మంత్రి గో బ్యాక్ అని నినాదాలు చేయడంతో మంత్రి వెనుదిరిగారు.
Next Story

