Sun Mar 15 2026 11:53:52 GMT+0530 (India Standard Time)
రెడ్ బుక్ చూసి వైసీపీ నేతల్లో వణుకు
రెడ్ బుక్ ను చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

రెడ్ బుక్ ను చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తప్పులు చేసిన వారిని ఖచ్చితంగా దోషులుగా నిలబట్టేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చంద్రబాబును చేసే అభివృద్ధిని చూసి జగన్ పార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారని కొల్లు రవీంద్ర అన్నారు. చట్ట ప్రకారమే ఎవరికైనా శిక్షలుంటాయని ఆయన తెలిపారు.
భద్రత పెంచడంపై...
మరోవైపు తనకు భద్రత పెంచాలంటూ జగన్ కోరడం విడ్డూరంగా ఉందని కొల్లు రవీంద్ర అన్నారు. కానీ ప్రజలు జగన్ నుంచి భద్రతకావాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఆయనఅన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ కు ముఖ్యమంత్రి, ప్రధాని తరహాలో సెక్యూరిటీ ఉండదన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ విషయాన్ని మర్చి పోయి జగన్ న్యాయస్థానంలో పిటీషన్లు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.
Next Story

