Thu Mar 19 2026 05:07:03 GMT+0530 (India Standard Time)
ఏపీలో వాలంటీర్లకు త్వరలో గుడ్ న్యూస్
వాలంటీర్లకు త్వరలోనే శుభవార్త చెబుతామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు

వాలంటీర్లకు త్వరలోనే శుభవార్త చెబుతామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలోనే వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెబుతామాని తెలిపారు. వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉపాధి అవకాశాలు సైతం కల్పించడం జరుగుతుందన్నారు.
గత ప్రభుత్వం...
గత ప్రభుత్వం వాలంటీర్లకు ఐదువేల రూపాయలు వేతనం ఇచ్చి పని చేయించుకుని, వారికి ఉద్యోగ భద్రత లేకుండా వారి జీవితాలు నాశనం చేసిందని మండిపడ్డారు. కానీ తమ ప్రభుత్వం వాలంటీర్లు జీవితంలో సెటిల్ అయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందుకు అవసరమైన ఆదేశాలు త్వరలోనే వెలువడనున్నాయని తెలిపారు.
Next Story

