Sat Dec 06 2025 02:11:43 GMT+0000 (Coordinated Universal Time)
బాబుది మంగమ్మ శపధమే.. కొడాలి నాని ధ్వజం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ సభలోకి అడుగుపెట్టనని చెప్పడం ఒక డ్రామా అని కొడాలి నాని అన్నారు. సానుభూతి కోసం చంద్రబాబు ఎంతటికైనా దిగజారుతారన్నారు. సభలో కుటుంబ సభ్యుల ప్రస్తావన తేకపోయినా, తన భార్య పేరును ప్రస్తావించినట్లు చంద్రబాబు అబద్ధం చెబుతున్నారన్నారు.
సానుభూతి పొందేందుకే....
చంద్రబాబుకు కొన్ని మీడియా సంస్థలు సహకరిస్తున్నాయన్నారు కొడాలి నాని. చంద్రబాబు ఒక పథకం ప్రకారం ఈ డ్రామాలు ఆడుతున్నారన్నారు. ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి ప్రజల వద్ద సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. నిన్ననే ఈ మంగమ్మ శపథం స్క్రిప్ట్ తయారైందని, తనకు తెలుసునని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు పచ్చి వ్యభిచారిలా వ్యవహరిస్తారని, ఎవరినైనా వాడుకుంటారని, బాధపడుతున్నట్లు నటిస్తున్నారని కొడాలి నాని అన్నారు.
Next Story

