Fri Dec 05 2025 22:22:43 GMT+0000 (Coordinated Universal Time)
పాల్ బాబాయ్ ని మించిన పవన్
చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఏపీకి పొలిటికల్ టూరిస్ట్ లని మంత్రి కొడాలి నాని అన్నారు

చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఏపీకి పొలిటికల్ టూరిస్ట్ లని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రతి చిన్న విషయానికి రాద్ధాంతం చేయడం వారికి అలవాటుగా మారిందన్నారు. డీజిల్, గ్యాస్ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుందా? అని నాని ప్రశ్నించారు. హైదరాబాద్ లో జరిగిన రెక్కీ డ్రామాగా తేలిపోయిందన్నారు. గాలి మాటలు మాటలు మాట్లాడి కేఏ పాల్ బాబాయ్ కు మించి ఫన్ ఏపీ ప్రజలకు పంచి పెడుతున్నారని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ లో రెక్కీ జరిగితే వైసీపీకి సంబంధం కడుతూ మాట్లాడటం ఒక్క చంద్రాబబుకే చెల్లిందన్నారు.
గులకరాయి డ్రామా...
విశాఖలో హంగామా చేసిన పవన్ ఇప్పుడు ఇప్పటంలో హడావిడి చేసి వెళ్లిపోయాడని అననాు. మునుగోడులో కేఏ పాల్ తరహాలో ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చి రక్తి కట్టించారని కొడాలిన నాన ిసెటైర్ వేశారు. షో రెండు గంటలు నడిపి వెళ్లిపోయడాని ఎద్దేవా చేశారు. మందు తాగి ఎవరో హడావిడి చేస్తే దానికి రెక్కీ అని పేరు పెట్టి హడావిడి చేయడం వీరికే చెల్లిందన్నారు. చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలతో ఒక రాయి వేయించుకుని డ్రామాకు తెరతీశాడని తెలిపారు. గులకరాయితో చంద్రబాబు డ్రామా రక్తికట్టలేదన్నారు. ఇడుపులపాయలో హైవే వేయాలంటే పవన్ ప్రధాని కావాలని, ప్రధాని పదవి కోసం కేఏ పాల్ తో పోటీ పడవచ్చని నాని సెటైర్ వేశారు.
Next Story

