Fri Jan 30 2026 03:09:53 GMT+0000 (Coordinated Universal Time)
హెరిటేజ్ లో రేట్లు చూసుకో బాబూ?
చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ సంస్థలో నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి కొడాలి నాని అన్నారు.

చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ సంస్థలో నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి కొడాలి నాని అన్నారు. బయట మార్కెట్ లో కంటే హెరిటేజ్ లో ధరలు ఎక్కువగా ఉన్న విషయాన్ని చంద్రబాబు గమనించాలని కోరారు. ఆశీర్వాద్ గోధుమ పిండి హెరిటేజ్ లో 59 రూపాయలు ఉందని, అదే బయట మార్కెట్ లో 52 రూపాయలు ఉందని కొడాలి నాని చెప్పారు. ఈ విషయాలను తెలుసుకుని ప్రభుత్వంపై చంద్రబాబు విమర్శలు చేస్తే బాగుంటుందని కొడాలి నాని సూచించారు.
మీడియా సంస్థలపై నిషేధం
దీంతో పాటు కొన్ని మీడియా సంస్థలను తమ పార్టీ నిషేధిస్తున్నట్లు కొడాలి నాని తెలిపారు. పార్టీ నేతలు ఎవరూ ఆ ఛానెళ్ల డిబేట్లకు వెళ్ల వద్దని, అలాగే వారిని మీడియా సమావేశాలకు ఆహ్మానించవద్దని కోరారు. ఈనాడు, ఈటీవీ, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ 5 ఛానెళ్లను బహిష్కరించాలని కొడాలి నాని పిలుపునిచ్చారు.
Next Story

