Fri Dec 05 2025 18:25:36 GMT+0000 (Coordinated Universal Time)
సెక్యూరిటీ తీసేసి వస్తాం.. చూసుకుందామా?
మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నందమూరి కుటుంబాన్ని చూసి తనకు జాలేసిందన్నారు. తాను, వల్లభనేని వంశీ సెక్యూరిటీని తీసేసి వస్తామని, ఎవరు తమపై దాడి చేస్తారో చూస్తామని కొడాలి నాని హెచ్చరించారు. చంద్రబాబు సెక్యూరిటీ వదిలేసి రాగలరా? అని నాని సవాల్ విసిరారు. చంద్రబాబు ఒక రాజకీయ వ్యభిచారి అని కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక లోఫర్, అందరినీ వాడుకున్న చంద్రబాబు చివరకు భార్యను కూడా రాజకీయంగా వాడుకున్నారని నాని అన్నారు.
జూనియర్ ఎన్టీఆర్....
వంశీ, తాను ఒకప్పుడు టీడీపీలోనే ఉన్నామని, అయితే అక్కడ పొసగక బయటకు వచ్చామని కొడాలి నాని తెలిపారు. తాము జూనియర్ ఎన్టీఆర్ కు ఒకప్పుడు సన్నిహితులమేనని, అయితే ఆయన తమను ఎందుకు కంట్రోల్ చేస్తారని కొడాలి నాని అన్నారు. జూనియర్ తో తమకేంటి సంబంధమని కొడాలి నాని ప్రశ్నించారు. జగన్ కోసం తాము ఏదైనా చేస్తామని కొడాలి నాని తెలిపారు. నందమూరి కుటుంబం అంటే తమకు ఇప్పటికీ గౌరవమని కొడాలి నాని తెలిపారు.
Next Story

