Tue May 14 2024 10:08:17 GMT+0000 (Coordinated Universal Time)
హరీశ్... ఏపీలో ఒక్కసారి తొంగి చూడు
తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఛాలెంజ్ చేశారు
తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఛాలెంజ్ చేశారు.ఒకసారి ఏపీకి వచ్చి తొంగి చూడాలని కోరారుె. అభివృద్ధి అంటే ఏమిటో ఏపీని చూస్తే అర్థమవుతుందని కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. మోస్తరు వర్షం పడినా హైదరాబాద్ మునిగిపోతుందన్న విషయాన్ని హరీశ్ రావు మర్చిపోయి మాట్లాడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. మీ బొక్కలు, మీ లొసుగులు అక్కడి ప్రతిపక్షాలే చెబుతున్నాయని ఎద్దేవా చేశారు.
చినుకు పడితే హైదరాబాద్...
వాళ్ల రోడ్లు, వాళ్ల బాగోగులు చూసుకుంటే మంచిదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సూచించారు. ఏపీలో రహదారుల పరిస్థితి బాగానే ఉందన్నారు. తెలంగాణ కంటే మెరుగైన సదుపాయాలను ఇక్కడ కల్పిస్తున్నామని చెప్పారు. ఇక్కడ అమలయ్యే పథకాలు తెలంగాణలో జరుగుతున్నాయా? అని ప్రశ్నించారు. ఇక్కడికి వచ్చి ప్రజలను వైసీపీ ప్రభుత్వ పాలన గురించి అడిగితే తెలుస్తుందని కారుమూరి నాగేశ్వరరావు హితవు పలికారు.
Next Story