Fri Dec 05 2025 20:13:48 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు గుండె చాలా గట్టిది.. మంత్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబు గురించి మాట్లాడాలంటే ఏడాది శాసనసభ సమావేశం పెట్టినా సరిపోదని మంత్రి కన్నబాబు అన్నారు.

చంద్రబాబు గురించి మాట్లాడాలంటే ఏడాది శాసనసభ సమావేశం పెట్టినా సరిపోదని మంత్రి కన్నబాబు అన్నారు. వ్యవసాయరంగంపై మంత్రి కన్నబాబు అసెంబ్లీలో మాట్లాడారు. చంద్రబాబు అన్ని పార్టీలనూ కౌగిలించుకున్నారన్నారు. చంద్రబాబుకు ప్రతిదీ రాజకీయమేనని తెలిపారు. ఆయనకు తెలిసింది ఒక్కటేనని, న్యాయస్థానాలకు వెళ్లి అడ్డుకోవడమేనని కన్నబాబు అన్నారు. ఏపీలో వ్యవసాయరంగంలో అమలవుతున్న సంస్కరణలను ఇతర రాష్ట్రాలు కూడా ప్రశంసించాయన్నారు.
ఆయనకు ప్రతిరోజూ రాజకీయమే...
చంద్రబాబుకు ప్రతిరోజూ రాజకీయమే కావాలని, ప్రజల బాధ పట్టదని కన్నబాబు తెలిపారు. తిరుపతికి వచ్చిన అమిత్ షాపై రాళ్లు వేయించిన చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేశారన్నారు. మంగళగిరిలోనూ లోకేష్ ఓటమిని తట్టుకున్న గుండె చంద్రబాబుది అని, కుప్పం ఓటమి ఆయనకు లెక్క కాదని కన్నబాబు తెలిపారు. జగన్ ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే కాకుండా, రైతుల ప్రయోజనాలను కాపాడుతుందన్నారు.
Next Story

