Fri Feb 14 2025 12:05:44 GMT+0000 (Coordinated Universal Time)
దండకారణ్యంలో అగ్నిప్రమాదం.. కందుల దుర్గేష్ ఏమన్నారంటే?
రాజానగరం దండకారణ్య ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద తీవ్రతను చాలా వరకూ తగ్గించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు

రాజానగరం సమీపంలో అధిక విస్తీర్ణంలో విస్తరించి ఉన్న దండకారణ్య ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద తీవ్రతను చాలా వరకూ తగ్గించామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. మంగళవారం రాజానగరం సమీపంలోని దండకారణ్య ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగిందన్న విషయం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ హుటా హుటిన అధికారులు, స్థానిక శాసనసభ్యులు బత్తుల బలరామ కృష్ణతో కలిసి ప్రమాదస్థలికి వెళ్లారు..ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభయారణ్యంలో ఆకులు రాలిన చాలకాలం తర్వాత అవి లిట్టర్ గా మారాక మానవ ప్రమేయంతో ప్రమాదం జరిగినట్టుగా భావిస్తున్నామన్నారు.. ప్రమాదం పెద్దది కాకముందే అగ్నిమాపక సిబ్బంది త్వరతగతిన వచ్చి సమస్యను పరిష్కరించారని పేర్కొన్నారు.
వెంటనే స్పందించినందున...
త్వరతగతిన స్పందించడం వల్ల చాలా సంఖ్యలో వృక్షాలు కాలి బూడిదకాకుండా కాపాడ గాలిగామన్నారు. ఈ సందర్భంగా అధికారులు, అగ్ని మాపక సిబ్బంది పనితీరును మంత్రి అభినందించారు.. రాష్ట్ర అటవీ సంపాదన కాపాడే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఈ తరహా అంశంపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు.. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన నివారణ చర్యలు చేపడతామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.. ప్రజలు కూడా కమిటీగా ఏర్పడి ఇలాంటి విపత్తులను ఎదుర్కొనేలా చైతన్యం కల్పిస్తామని కందుల దుర్గేష్ తెలిపారు.
Next Story