Sun Mar 15 2026 23:58:59 GMT+0530 (India Standard Time)
సీీబీఐ విచారణను నేనే కోరా : కాకాణి
కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.

కోర్టు తీర్పును తాను స్వాగతిస్తున్నానని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసుపై సీబీఐ విచారణను ఎదుర్కొంటామని తెలిపారు. తాము తెలుగుదేశం పార్టీ నేతలు మాదిరి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునే వారం కాదని ఆయన చెప్పారు. ఆయన కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తనపై నమోదయిన అన్ని కేసుల్లోనూ కోర్టులకు వెళ్లి స్టే లు తెచ్చుకున్నారన్నారు.
చంద్రబాబుకు దమ్ముందా?
కానీ తాను అలాంటి వాడిని కాదని, నెల్లూరు కోర్టులో జరిగిన చోరీ కేసులో నిజానిజాలు తెలియాలన్నారు. తాను సోమిరెడ్డిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆయన తెలిపారు. నీతిగా ఉండబట్టే తాను సీబీఐ విచారణను కోరామని చెప్పారు. దమ్ముంటే చంద్రబాబు తనపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధంగా ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ నేతలు తనపై విమర్శలు మాని సీబీఐ విచారణకు చంద్రబాబును ఒప్పించాలని కోరారు.
Next Story

