Tue Jan 20 2026 22:39:42 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ ఇంటివద్ద రెక్కీపై మంత్రి ఏమన్నారంటే?
హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ఇంటి వద్ద జరిగిన రెక్కీపై మంత్రి జోగి రమేష్ స్పందించారు

హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ఇంటి వద్ద జరిగిన రెక్కీపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. తమకు పవన్ గురించి ఆలోచించే సమయం లేదని ఆయన తెలిపారు. ఎదుట పార్టీ నేతలు బాగుండాలనే తాము కోరుకుంటామని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం కేవలం ప్రజల సంక్షేమం గురించే ఆలోచన చేస్తుందన్నారు. శత్రువు కూడా బాగుండాలని కోరుకునే పార్టీ తమది అని జోగి రమేష్ అన్నారు. పవన్ కల్యాణ ఇంటి వద్ద ఎవరో ఏదో చేస్తే తమకు ఏంటి సంబంధం అని ఆయన ప్రశ్నించారు.
చట్టప్రకారమే...
ఇక అయ్యన్న పాత్రుడి అరెస్ట్ చట్ట ప్రకారం జరిగిందన్నారు. దీనికి బీసీ రంగు పులుమడానికి టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తే ఎందుకు ఊరుకుంటారని ఆయన ప్రశ్నించారు. అయ్యన్న 420 పనిచేశారన్నారు. దానికి బీసీలకు సంబంధమేంటని అని అన్నారు. టీడీపీకి సొంత రాజ్యాంగం ఏదైనా రాశారా? అని ఆయన నిలదీశారు. అక్రమాలకు పాల్పడే నేతలపై కేసులు పెట్టకతప్పదని ఆయన అన్నారు. బీసీలను రెచ్చగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని, ప్రయత్నిస్తున్నారని, కానీ నమ్మే వారు ఎవరూ లేరని ఆయన అన్నారు.
Next Story

