Sat Mar 07 2026 18:02:42 GMT+0530 (India Standard Time)
మంత్రికి తృటిలో తప్పిన ప్రమాదం
మంత్రి జోగి రమేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన నెల్లూరు వైపు వెళుతుండగా కాన్వాయ్ లో ఉన్న వాహనాలు ఢీకొన్నాయి.

మంత్రి జోగి రమేష్ కు తృటిలో ప్రమాదం తప్పింది. ఆయన నెల్లూరు వైపు వెళుతుండగా ఆయన కాన్వాయ్ లో ఉన్న వాహనాలు ఒకాదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో జోగి రమేష్ ప్రయాణిస్తున్న వాహనం దెబ్బతినింది. అయితే ఈ ప్రమాదంలో మంత్రి జోగి రమేష్ కు ఎలాంటి గాయాలు కాలేదు.
నెల్లూరుకు వెళుతుండగా..
జోగి రమేష్ కాన్వాయ్ కు ప్రమాదం జరగడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఆయనకు ఫోన్ల ద్వారా మిత్రులు సంప్రదింపులు జరిపారు. నెల్లూరుకు వెళుతుండగా ఒంగోలుకు సమీపంలోని పెళ్లూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే జోగి రమేష్ వెంటనే వేరే వాహనంలో వెళ్లిపోయారు.
Next Story

