Sat Mar 21 2026 04:47:20 GMT+0530 (India Standard Time)
ఆ నేతను బర్తరఫ్ చేసిన వైసీపీ
మంగళగిరి జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో

మంగళగిరి జయహో బీసీ సభలో మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీలో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఆయన తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. చంద్రబాబు పసుపు కండువా కప్పి సాదర స్వాగతం పలికారు. జయరాంతో పాటు ఆయన మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు.
తెలుగుదేశం పార్టీలో చేరిన మంత్రి గుమ్మనూరు జయరాంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటు వేసింది. కేబినెట్ నుంచి జయరాంను బర్తరఫ్ చేస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు పంపారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు మంత్రి పదవికి రాజీనామా చేసిన జయరాం టీడీపీలో చేరారు. గుమ్మనూరు జయరాంను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సిఫార్సు చేశారు సీఎం జగన్. ఇక, సీఎం నిర్ణయానికి ఆమోదించిన గవర్నర్ ఈ మేరకు గెజిట్ విడుదల చేయడంతో గుమ్మనూరు జయరాం కేబినెట్ నుంచి బర్తరఫ్ అయ్యారు.
Next Story

