Fri Mar 20 2026 15:37:30 GMT+0530 (India Standard Time)
మే3న జగన్ శంకుస్థాపన
భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కు మే 3న శంకుస్థాపన జరుగుతుందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు

భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కు మే 3న శంకుస్థాపన జరుగుతుందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. దాదాపు 2,200 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జరుగుతుందని మంత్రి అమర్ నాథ్ వెల్లడించారు. ఆయన మీడియాతో ఈ విషయం వెల్లడించారు.
రెండేళ్లలో...
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వల్లవన్, ఎమ్మల్యే బడ్డుకొండ అప్పల నాయుడు తో కలసి భోగాపురం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి పనులు ప్రారంభించి 24 నుంచి 30 నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేస్తామని తెలిపారు. జీఎంఆర్ సంస్థ ఈ పనులను పూర్తి చేస్తుందని మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పారు.
Next Story

