Fri Mar 20 2026 15:35:29 GMT+0530 (India Standard Time)
ఏపీనీ ఏ రాష్ట్రంతో పోల్చొద్దు : మంత్రి అమర్ నాథ్
తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ ను పోల్చవద్దని ఐటీ శాఖమంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు

తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ ను పోల్చవద్దని ఐటీ శాఖమంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. ఏపీనీ వేరే రాష్ట్రాలతో పోల్చడం మానుకోవాలని ఆయన కోరారు. తనను కేటీఆర్‌తోనూ పోల్చవద్దని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి మరో రెండు దశాబ్దాల సమయం పడుతుందని ఆయన తెలిపారు.
పది మంది ఏపీ వారే...
అయితే తెలంగాణలో ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసే ప్రతి వందమందిలో పదిహేను మంది తెలుగు వాళ్లున్నారన్న అమరనాథ్ వారిలో పది మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారేనని తెలిపారు రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎంతో నష్టపోయిందన్న మంత్రి కోలుకోవడానికి మరింత సమయం పడుతుందన్నారు.
Next Story

