Fri Dec 05 2025 12:37:31 GMT+0000 (Coordinated Universal Time)
ట్యాపింగ్ కాదది.. రికార్డింగేమో...?
ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి గుడివాడ అమరనాథ్ ఖండించారు

ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి గుడివాడ అమరనాథ్ ఖండించారు. ఆయన ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. ఫోన్ ఎవరో రికార్డింగ్ చేసి బయటపెట్టి ఉంటారని, దానిని ట్యాపింగ్ గా భావిస్తే ఎలా అని మంత్రి అమరనాథ్ ప్రశ్నించారు.
అవనసర ఆరోపణలు...
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవచ్చన్నారు. దానిని ఎవరూ అభ్యంతర పెట్టరని, అయితే అనవసర ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అవాస్తవ ఆరోపణలు చేయడం కోటంరెడ్డికి తగదని మంత్రి అమరనాథ్ హితవు చెప్పారు. ఆయన ముందుగానే పార్టీని వీడేందుకు సిద్ధమై ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని అమరనాథ్ అన్నారు.
Next Story

