Thu Mar 19 2026 13:07:40 GMT+0530 (India Standard Time)
స్పీకర్ పై జగన్ కు అంత వ్యతిరేకత ఎందుకు?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ కు జగన్ లేఖ రాయడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. అర్హత లేకపోయినప్పటికీ జగన్ కు అసెంబ్లీలో గౌరవం లభించిందని గొట్టిపాటి రవికుమార్ అన్నారు. జగన్ వాహనాన్ని లోపలికి అనుమతించారన్న విషయాన్ని గుర్తు చేశారు.
లేఖ రాసి మరీ...
అయితే అవన్నీ మర్చిపోయి జగన్ స్పీకర్ కు లెటర్ రాయడమేంటని గొట్టిపాటి రవికుమార్ ప్రశ్నించారు. వక్ర భాష్యంతో స్పీకర్ కు జగన్ లేఖ రాశారని ఆయన ఆరోపించారు స్పీకర్ ను జగన్ టార్గెట్ చేశారన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ ను జగన్ అవమానిస్తూ లేఖ రాయడం సబబు కాదని గొట్టిపాటి హితవు పలికారు.
Next Story

