Tue Dec 16 2025 23:45:54 GMT+0000 (Coordinated Universal Time)
మంత్రి ధర్మాన సంచలన కామెంట్స్.. వాలంటీర్లు ఎవరూ లేరు
మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాలంటీర్లు ఎవరూ రాష్ట్రంలో లేరన్నారు.

మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వాలంటీర్లు ఎవరూ రాష్ట్రంలో లేరన్నారు. వాలంటీర్లంతా రాజీనామాలు చేశారన్నారు. వాళ్లు తమ పార్టీ కార్యకర్తలని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్రస్తుతం వాలంటీర్లంతా వైసీపీ కార్యకర్తలేనని అన్నారు. రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ అధికారంలోకి రాగానే మళ్లీ నియమిస్తామని చెప్పారు.
గతంలో వాళ్లంతా...
ీవాలంటీర్లు గతంలో పార్టీ ఆశయాలను నమ్మి వచ్చినవారేనని అన్నారు. ఐదేళ్ల పాటు టీడీపీ నేతలు వాలంటీర్లను ఎంతగా అవమానించినా వారు దిగమింగుకుని ప్రజలకు సేవలందించారని చెప్పారు. టీడీపీ వస్తే విద్యుత్తు రేట్లు పెంచమని చెబుతున్నారని, అంటే ఇప్పుడున్న రేట్లు కొనసాగించనున్నట్లే కదా? అని ఆయన ప్రశ్నించారు.
Next Story

