Tue Mar 17 2026 00:56:24 GMT+0530 (India Standard Time)
మంత్రి ధర్మాన రాజీనామాకు జగన్ నో
మంత్రి ధర్మాన ప్రసాదరావు తన రాజీనామాను అనుమతించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు

మంత్రి ధర్మాన ప్రసాదరావు తన రాజీనామాను అనుమతించాలని ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. అయితే అందుకు జగన్ నిరాకరించారు. మూడు రాజధానుల తమ పార్టీ విధానమని, ప్రభుత్వం కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తుందని జగన్ ఈ సందర్భంగా ధర్మానకు తెలిపినట్లు చెబుతున్నారు. రాజీనామాను తాను అనుమతించే ప్రసక్తి లేదని జగన్ ధర్మానకు జగన్ స్పష్టం చేసినట్లు సమాచరం.
జగన్ ను కలిసి...
మూడు రాజధానులకు మద్దతుగా, విశాఖలో పరిపాలన రాజధానిని కాంక్షిస్తూ ధర్మాన ప్రసాదరావు ఇటీవల రాజీనామా చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొనాలని ఆయన భావించారు. రాజీనామాను అనుమతించాల్సిందిగా కొద్దిసేపటి క్రితం జగన్ ను కలసి తన రాజీనామా విషయాన్ని ప్రస్తావించగా అందుకు జగన్ నో చెప్పినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Next Story

