Fri Dec 05 2025 20:49:11 GMT+0000 (Coordinated Universal Time)
పవన్ పై బొత్స ఫైర్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అధికారంలోకి రావాలనకున్న వాళ్లు ఏం చేస్తామో చెప్పాలన్నారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అధికారంలోకి రావాలనకున్న వాళ్లు తాము ఏం చేస్తామో చెప్పాలన్నారు. అంతే తప్ప వేరే వారిని ముఖ్యమంత్రిని చేయడం కోసం మనం పనిచేయాలని క్యాడర్ కు ఏ పార్టీ అధినేత అయినా పిలుపునిస్తాడా? అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. పవన్ ప్రసంగంలో దూషణలు తప్ప విధానపరమైన నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా? అని నిలదీశారు.
డైలాగులు చెప్పినంత మాత్రాన....
వ్యక్తిగత విమర్శలు చేస్తూ పవన్ కల్యాణ్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. సినిమా డైలాగులు చెబితే ప్రజలు నమ్మరని అన్నారు. సినిమాకు, రాజకీయాలకు చాలా తేడా ఉందని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులు వదిలేసి, విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే కదా? నువ్వు ఓట్లు చీల్చకుండా చేయడానికి అని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. వైసీపీని విమర్శించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివినంత మాత్రాన ఓట్లు పడవని బొత్స అన్నారు.
Next Story

