Wed Mar 18 2026 09:54:32 GMT+0530 (India Standard Time)
బీఆర్ఎస్ పై బొత్స ఏమన్నారంటే?
ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ఆయన స్పందించారు

ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై ఆయన స్పందించారు. బీఆర్ఎస్ వల్ల పెద్దగా ఎవరికీ నష్టం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీఆర్ఎస్ వచ్చి సాధించేందేమీ ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అనేక పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటిగా మారుతుందని అన్నారు. దాని వల్ల తమ పార్టీకయితే ఎలాంటి నష్టం ఉండదని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎంతమంది పోటీలో ఉంటే అంత మంచిదన్నారు.
రైతుల పాదయాత్ర...
అమరావతి రైతుల పాదయాత్ర మానుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. రియల్ ఎస్టేట్ కోసమే కొందరు ఈ యాత్రను చేస్తున్నారన్నారు. పాదయాత్ర చేస్తున్న వారిలో రైతులు ఎవరూ లేరని, ఉన్నవారంతా టీడీపీ, రియల్ ఎస్టేట్ దోపిడీదారులేనని అన్నారు. ఏం ఉద్ధరించడానికి పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ తమతో చర్చకు సిద్దమా అని ఆయన ప్రశ్నించారు. తమ భూముల ధరను పెంచుకోవడానికే పాదయాత్ర చేస్తున్నారన్నారు.
Next Story

