Sun Mar 08 2026 00:12:55 GMT+0530 (India Standard Time)
త్వరలోనే పరిపాలన రాజధాని మొదలు
త్వరలోనే ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని మొదలవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు

త్వరలోనే ఉత్తరాంధ్రలో పరిపాలన రాజధాని మొదలవుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అయితే కొన్ని అడ్డంకులున్నాయని, అవి త్వరలోనే తొలగిపోతాయని ఆయన అన్నారు. విశాఖ నుంచి పరిపాలన అతి త్వరలోనే ప్రారంభమవ్వడం ఖాయమని ఆయన తెలిపారు.
పాదయాత్ర ఫేక్....
అమరావతి రైతుల పాదయాత్ర ఫేక్ అని తేలిపోయిందన్నారు. ఆ పాదయత్రలో రైతులు ఎవరూ లేరని తేలిపోయిందన్నారు. ఇక రైతుల పాదయాత్ర జరిగే అవకాశం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రైతుల ముసుగులో కొందరు ఇన్నాళ్లు యాత్ర చేశారని ఆయన ఫైర్ అయ్యారు.
Next Story

