Wed Mar 18 2026 08:18:06 GMT+0530 (India Standard Time)
చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై బొత్స ఏమన్నారంటే?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఆయన ఎవరితో పొత్తు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా తమకు సంబంధం లేదని అన్నారు. తాము ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి రెండోసారి విజయం సాధించడం తధ్యమని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు వెంట పార్టీలుంటే, తమ వెంట ప్రజలున్నారని ఆయన అన్నారు. మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు.
అంతే వేగంగా...
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో పొత్తు పెట్టుకోని దెవరితో చెప్పాలని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆయన అందరితోనూ స్పీడ్ గా కలుస్తారని, అవసరం తీరిన తర్వాత ఆయన వదిలించుకోవడం కూడా అంతే వేగంతో చేస్తారని బొత్స ఎద్దేవా చేశారు. తాము ఒంటరిగానే బరిలోకి దిగి ఎవరితో పొత్తుపెట్టుకున్నా చంద్రబాబును ఓడించడం ఖాయమని బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు ఎన్ని ఫీట్లు చేసినా జనం తమ వైపు ఉన్నారన్న విషయం తెలిసి ఆయన భయపడిపోయి పొత్తుల కోసం పాకులాడుతున్నారన్నారు.
Next Story

