Wed Mar 18 2026 08:21:23 GMT+0530 (India Standard Time)
హరీశ్ కు మంత్రి బొత్స కౌంటర్ వార్నింగ్
తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండి పడ్డారు. ఏపీ గురించి మాట్లాడటానికి హరీశ్ ఎవరని ప్రశ్నించారు

తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై మంత్రి బొత్స సత్యనారాయణ మండి పడ్డారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడటానికి హరీశ్ రావు ఎవరని మంత్రి ప్రశ్నించారు. వాళ్ల రాష్ట్రం గురించి వాళ్లు మాట్లాడుకుంటే చూసుకుంటే మంచిదని హితవు పలికారు. బాధ్యత గల మంత్రులుగా మాట్లాడాలని హెచ్చరించారు.
ఆయనెవరు?
గతంలో ప్రత్యేక హోదా గురించి ఎవరు ఏం మాట్లాడారో అందరకీ తెలుసునని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఎవరు ఏం మాట్లాడారో ఇంకా ఏపీ ప్రజలు మరిచిపోలేదన్నారు. హరీశ్ రావు రాజకీయాల కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చే్తున్నారన్నారు. తెలంగాణ వాళ్లు అమెరికాలో ఉండాలని కోరుకుంటున్నారో అందరికీ తెలుసునని అన్నారు. ఎవరి రాష్ట్రం గురించి వారు చూసుకుంటే మంచిదని బొత్స సత్యనారాయణ హితవు పలికారు.
Next Story

