Mon Jan 26 2026 07:39:12 GMT+0000 (Coordinated Universal Time)
పియూష్ గోయల్ నీ అబద్ధాలు కట్టిపెట్టు : బొత్స సత్యనారాయణ
రైల్వే జోన్ పై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు

రైల్వే జోన్ పై కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. విశాఖ రైల్వే జోన్ కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. 52 ఎకరాలను గుర్తించి దానిని రైల్వే శాఖను అప్పగించామని బొత్స తెలిపారు. విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైల్వే జోన్ ఏర్పాటులో జాప్యానికి కారణం కేంద్ర ప్రభుత్వమేనని బొత్స సత్యనారాయణ అన్నారు. అబద్ధాలతో ప్రజలను మోసం చేయాలని చూడటం తగదన్నారు.
ఆధారాలివిగో...
కావాలంటే ఇందుకు తగిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఆయన మీడియా సమావేశంలో చూపించారు. స్థలం ఇవ్వకపోవడం వల్లనే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు ఆలస్యమయిందిని పియూష్ గోయల్ చేస్తున్న వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని బొత్స సత్యనారాయణ అన్నారు. పియూష్ గోయల్ వంటి సీనియర్ నేతకు ఇలా అబద్ధాల చెప్పడం తగదని అన్నారు. రైల్వేకు ఆ స్థలాన్ని ఎప్పుడో అప్పగించిందని చెప్పారు. ఉన్న ప్రత్యేక హోదాను వద్దను కునిచంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నారని విమర్శించారు.
Next Story

